ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలన్ గా సముద్రఖని ద్విపాత్రాభినయం!

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 14, 2021, 08:43 PM

నితిన్ హీరోగా ఎస్. ఆర్. శేఖర్ దర్శకత్వంలో 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందుతోంది. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ ప్రాజెక్టు, ఇటీవలే పట్టాలెక్కింది. నితిన్ సొంత బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టి కనిపించనుంది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సముద్రఖని పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు.


ఇది ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. త్వరలోనే ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడని అంటున్నారు. 'అల వైకుంఠపురములో' .. 'క్రాక్' సినిమాల దగ్గర నుంచి విలన్ గా సముద్రఖనికి ఇక్కడ విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఆయన విలనిజంలోని ప్రత్యేకత ఇక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. అందువల్లనే ఈ సినిమా కోసం ఆయనను తీసుకున్నారని చెప్పుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa