ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భరత్ బ్యూటీ భలే మాట్లాడుతోందబ్బా

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 27, 2018, 02:49 PM

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్బాబు ముఖ్యమంత్రిగా చేస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాపై భారీ అంచనాలున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమవుతోంది బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాణీ. ఆ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా కోసం కైరా కోటి డిమాండ్ చేసిందని టాక్.


డిగ్రీ పూర్తవ్వగానే సినిమాల్లోకి రావాలనుకుందట ఈ ముంబై భామ. ఈ విషయమై మాట్లాడుతూ ‘‘మోడల్గా  రాణించడం సులువే కానీ ఓ నటిగా గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం. తెర ముందు కనిపించాలంటే ముందు తెర వెనక చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే నాకు ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమంటే చాలా ఇష్టం. అలాగే మనుషుల కదలికలను గమనిస్తూ ఉంటాను. సినిమాల్లోకి రావడం వల్ల నాకు ఎదుటివారిని అర్థం చేసుకోవడమూ తెలిసింది. సినిమాల్లోకి రావాలనుకునేవారు ఒక విషయం తెలుసుకోవాలి. బయట మనకి ఏమైనా కావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఇరుక్కోవచ్చు కానీ ఆ ప్రభావం తెర పైన కనిపించకూడదు. నాపాటికి నేనెప్పుడు సెట్స్ వెళ్లినా సంతోషంగా ఉంటాను...’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ చిన్నది.


అలాగే దక్షిణాదిలో సూపర్స్టార్ మహేష్ బాబు - సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరిటాల శివ వంటి వాళ్ల సినిమాతో ఎంట్రీ ఇస్తుండడం చాలా సంతోషాన్నిస్తోందనీ. తనమీద నమ్మకం ఉంచిన ‘భరత్ అనే నేను’ టీం మొత్తానికి కృతజ్ఞతలు తెలిపింది కైరా. దర్శకుడు ముందుగానే డైలాగ్స్ ఇవ్వడం వల్ల భాష రాకపోవడం పెద్ద ఇబ్బంది కాలేదనీ ఈ చిత్రంలో ఓ కాలేజీ విద్యార్థినిగా నటిస్తున్నానని చెప్పేసింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa