ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య భామ ఇంకా చాలా చేయాలట

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 10:29 AM

నందమూరి బాలకృష్ణ మూవీ పైసా వసూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన బ్యూటీ ముస్కాన్ సేథి. ఇలా ఒక స్టార్ హీరోతో సినిమాల్లోకి రావడం అందరికీ దక్కే అదృష్టం కాదని చెబుతోంది ఈ భామ. ఆన్ స్క్రీన్ పై తనను తాను చూసుకోవాలనే కోరిక తీర్చిన పైసా వసూల్ తర్వాత.. ఇప్పుడు తనకు పలు అవకాశాలు వస్తున్నట్లుగా చెబుతోంది.డిగ్రీ తర్వాత ఆర్ట్స్ వైపు వెళ్లేందుకు ఆలోచించినా.. సినిమా ఫీల్డ్ లో వెలగాలనే థాట్ మాత్రం మనసులో ఉందని చెప్పింది ముస్కాన్ సేథి. అయితే.. ఆశావహ దృక్పథంతో ఆలోచించే తాను.. ఇటు వైపు కూడా ఫోకస్ పెట్టినట్లుగా చెబుతోంది. అదే తనకు సినిమాల్లో వెలిగేవరకూ తెచ్చిందని అంటోంది ముస్కాన్. ఇప్పుడు తన జర్నీ ప్రారంభం మాత్రమే.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని అంటున్న ముస్కాన్ సేథీ.. జీవితంలో పలు స్టేజ్ లలో పరిచయం ప్రజల నుంచి అనేక అంశాలు నేర్చుకోవచ్చని చెబుతోంది.


ప్రతీ ప్రాజెక్టు ద్వారా ఏదో ఒకటి కచ్చితంగా నేర్చుకోవడం జరుగుతుందని.. విభిన్నమైన పాత్రలు చేయడం ద్వారా.. ఆయా పాత్రల గురించి మాత్రమే కాదు.. కొన్ని జీవితాల గురించి తెలుసుకోవచ్చని చెబుతున్న ముస్కాన్ సేథి.. యాక్టింగ్ వర్క్ షాప్స్ ఇందుకు సహకరిస్తాయని చెబుతోంది. ప్రస్తుతం తనకు టాలీవుడ్ రెండో ఇల్లు మాదిరిగా మారిపోయిందని.. అంతగా ఇక్కడి ప్రజల నుంచి తనకు ఆదరణ లభిస్తోందని మురిసిపోతోంది ముస్కాన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa