ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లుడు శ్రీ‌నుతో కాజ‌ల్…

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 11:45 AM

ఒకప్పుడు సీనియర్‌ హీరోలతో నటించిన కాజల్‌ ఇప్పుడు యువ హీరోలతో జత కడుతోంది. సహజంగా తొలినాళ్ళలో వర్ధమాన హీరోలతో నటించి ఆ తర్వాత స్టార్స్‌తో నటించే స్థాయికి చేరుకుంటారు. కానీ కాజల్‌ కెరీర్‌ దీనికి భిన్నంగా సాగుతోంది. చిరంజీవితో ఖైదీ నెంబర్‌ 150లో నటించిన తర్వాత ఆమె యువ హీరోల చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. నేనే రాజు – నేనే మంత్రి చిత్రంలో రానాతో జోడీగా నటించింది. ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కల్యాణ్‌రామ్‌తో ఎమ్మెల్యే చిత్రంలో నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్‌ తెచ్చుకుంది. తాజాగా బెల్లంకొడ శ్రీనివాస్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో నాయికగా కాజల్‌ ఎంపికైంది. ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వంశధార క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభించి హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రంలో నటించే హీరోయిన్‌ కాజల్‌ అని అధికారికంగా ప్రకటించారు. రెండవ షెడ్యూల్‌ నుండి కాజల్‌ షూటింగ్‌లో పాల్గొంటారు.


ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి అబ్బూరి రవి, చోటా కె.నాయుడు, తమన్‌, చోటా కె.ప్రసాద్‌, స్టన్‌ శివ సాంకేతిక సహకారం అందిస్తున్నారు. నిర్మాత నవీన్‌ శొంటినేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం శ్రీనివాస్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa