అజయ్ భూపతి దర్శకత్వం లో శర్వానంద్, సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మన్యూయేల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మహా సముద్రం'. ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 14 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రం విడుదల కి సిద్దం అవుతుండటం తో చిత్ర యూనిట్ ఇటీవల ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ అవుతూ ఉండగా, యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ 7.1 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అంతేకాక 200కే కి పైగా లైక్స్ ను సొంతం చేసుకోవడం జరిగింది. జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa