ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫ్యాన్స్‌తో ముచ్చటించడానికి సిద్దమైన సమంత

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 28, 2021, 09:40 AM

సమంత.. ఇప్పుడు ఈ పేరు సెన్సేషన్‌గా మారింది. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు 'బుద్ది ఉందా.?' అని బదులిచ్చిన నాటి నుంచి సమంత టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. ప్రస్తుతం ఈ అందాల తార సోషల్‌ మీడియాలో ఏ చిన్న పోస్ట్‌ చేసినా అది సెన్సేషన్‌ అవుతోంది. తన వైవాహిక జీవితానికి సంబంధించి ఎలాంటి వార్తలు వస్తున్నా వాటన్నింటినీ పట్టించుకోని సమంత ప్రస్తుతం చెన్నైలో స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తోంది.


ఈ క్రమంలోనే తాజాగా సైక్లింగ్‌ చేస్తున్న సమయంలో తీసిన వీడియలోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది.. తరచూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఇకపోతే గతకొన్ని రోజులుగా సమంత ఈ చిట్‌చాట్స్‌కు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. అయితే తాజాగా మరోసారి ఫ్యాన్స్‌తో ముచ్చటించడానికి సిద్ధమైంది సామ్‌.


ఇందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ పోస్ట్‌ చేసింది. ఇందులో భాగంగా ఈ రోజు (సెప్టెంబర్‌ 28) సాయంత్రం 5 గంటలకు సమంత ఆన్‌లైన్‌లోకి రానున్నట్లు తెలిపింది. ఇక ఉదయం 11 గంటలకు 'వన్‌ విత్‌ సాకీ'ని సమంత ఎలా సెలబ్రేట్‌ చేసుకుంటుందో ఐజీ స్టోరీలో అడగండి అంటూ ఓ పోస్ట్‌ చేసింది. మరి సమంతను అభిమానులు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు.? అందుకు సామ్‌ ఏ సమాధానాలు చెప్పనుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. వీటితో పాటు తమిళంలో ఓ సినిమాలో నటిస్తోంది. విజ్ఞేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుండడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa