యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి దిగిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. వారి కుంటుంబానికి చెందిన చాలా మంది ఇందులో కనపడ్డారు. ఇందులోనే కృష్ణంరాజు, ప్రభాస్ కూడా ఉన్నారు.రెబల్ స్టార్ కుటుంబమంతా ఒకే చోట చేరి ఫొటో దిగడంతో అభిమానులను ఈ ఫొటో బాగా అలరిస్తోంది. గతంలో ప్రభాస్ నటించిన 'చక్రం' సినిమాలోని 'జగమంత కుటుంబం నాది' పాటను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa