టీవీ నటిగా, సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. బాలీవుడ్ స్టార్‌గా ఎదిగింది ముద్దుగుమ్మ మౌనీ రాయ్ . ఎప్పుడూ కూడా ఈ ముద్దుగుమ్మ తన విషయాలను చెబుతూ.. సరికొత్త ఫొటోలతో ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది బ్యూటీ మౌనీ రాయ్. నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. బుల్లితెర నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. తెరపైన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తూ రచ్చ చేసే మౌని ఆఫ్‌స్క్రీన్‌లోను సెగలు పుట్టిస్తుంది. నాగిని సీరియల్ తర్వాత మౌని రాయ్ క్రేజ్ బాగా పెరగగా, ఈ అమ్మడికి పలు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. అందాల ఆరబోతతో ఎక్కువగా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కేజీఎఫ్ లో ఐటమ్ నంబర్ తో ఇటు సౌత్ కి పరిచయమైంది ఈ బ్యూటీ. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కనువిందు చేసే మౌనీ రాయ్ చిన్న వయసులోనే పలువురి సలహా మేరకు మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన అందచందాలతో అందరినీ తన వైపునకు తిప్పుకుని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే సుదీర్ఘమైన ప్రయాణంలో పలు బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. అదే సమయంలో ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె.. అన్నింట్లోనూ తన అందంతో అదరగొట్టేసింది.ఆ సమయంలోనే పలు రకాల వ్యాపార ప్రకటనల్లోనూ నటించి మెప్పించింది. ఆ తర్వాత కథక్ డ్యాన్సర్‌గానూ ఈ అమ్మడు మెప్పించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa