ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో రీమేక్‌లు, మల్టీ స్టారర్ సినిమాల జోరు గట్టిగా కొనసాగుతుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబోలో ఆర్ఆర్ఆర్, పవన్-రానా కాంబోలో ‘భీమ్లా నాయక్’, వెంకటేశ్-వరుణ్ తేజ్ కలిసి ‘ఎఫ్-3’, శర్వానంద్-సిద్ధార్థ్ కాంబినేషన్లో ‘మహాసముద్రం’ సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో ఇద్దరు హీరోలు చేరుతున్నట్టు తెలుస్తుంది. దగ్గుబాటి రానా-శర్వానంద్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ వారు ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా ఫిల్స్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి... ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తుంది. అంతేకాదు త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa