ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిన్న అస్వస్థతకు గురైన రజనీకాంత్.. రజనీకాంత్ ఆరోగ్యంపై తాజా బులెటిన్ విడుదల

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 29, 2021, 03:52 PM

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేరడం తెలిసిందే. రజనీకాంత్ ఆరోగ్యంపై కావేరీ ఆసుపత్రి ఈ మధ్యాహ్నం తాజా బులెటిన్ విడుదల చేసింది. చెన్నై ఆళ్వారుపేటలోని కావేరీ ఆసుపత్రిలో నిన్న చేరారని, తల తిరుగుతుండడంతో ఆయన అసౌకర్యానికి గురయ్యారని ఆ బులెటిన్ లో వివరించారు.


రజనీకాంత్ ను నిపుణులైన వైద్య బృందం నిశితంగా పరిశీలించిందని, ఆయనకు కరోటిడ్ ఆర్టెరీ రీవాస్కులరైజేషన్ ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలో నేటి ఉదయం ఆయనకు రీవాస్కులరైజేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. మరికొన్నిరోజుల్లో రజనీకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆ బులెటిన్ లో వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa