ట్రెండింగ్
Epaper    English    தமிழ்

’సెప్టెంబర్‌ 8న మంచు మనోజ్‌ ’ఒక్కడు మిగిలాడు’

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2017, 04:25 PM

మంచు మనోజ్‌. తాజాగా ఎల్‌.టి.టి.ఈ మిలిటెంట్‌ చీఫ్‌ ప్రభాకరన్‌ పాత్ర పోషించనున్నాడు. అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్‌.ఎన్‌.రెడ్డి-లక్ష్మీకాంత్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్‌.ఎన్‌.రెడ్డి-లక్ష్మీకాంత్‌ లు మాట్లాడుతూ మునుపెన్నడూ భారతదేశ చలనచిత్ర చరిత్రలో చూడని సరికొత్త కథాంశాన్ని ఒక్కడు మిగిలాడు చిత్రంతో ప్రేక్షకులు చూడనున్నారు. మంచు మనోజ్‌ యాంగ్రీ యంగ్‌ మేన్‌ గా ఆశ్చర్యపరుస్తాడు. ఈ చిత్రం ట్రైలర్‌, పాటలు త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన మంచు మనోజ్‌ ఫస్ట్‌ లుక్‌ కి విశేషమైన స్పందన వచ్చింది. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేసిన ఈ చిత్రం సాంకేతికత పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం. సినిమా నేపధ్య సంగీతాన్ని ప్రాగ్‌ లో రికార్డ్‌ చేయనున్నాం  అన్నారు.


 


మంచు మనోజ్‌, అనీషా ఆంబ్రోస్‌, మిలింద్‌ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్‌.వర్మ, సినిమాటోగ్రాఫర్‌: వి.కోదండ రామరాజు, ఎడిటర్‌: కార్తీక శ్రీనివాస్‌, స్క్రీన్‌ ప్లే: గోపీమోహన్‌, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్‌.ఎన్‌.రెడ్డి-లక్ష్మీకాంత్‌, దర్శకత్వం: అజయ్‌ ఆండ్రూస్‌ నూతక్కి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa