రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల కలయికలో తెరకెక్కుతున్న భారీ సినిమా 'ఆర్ఆర్ఆర్' కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్‌గా విడుదల కానుంది. చిత్ర యూనిట్ కూడా చిత్రం నుంచి మంచి అప్ డేట్స్ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన 'నాటు నాటు' అనే మాస్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ మాస్ అంతే అరుదైన రికార్డును అందుకుంది. యూట్యూబ్లో అత్యంత వేగవంతమైన 1 మిలియన్ లైక్‌ల సాధించిన వీడియోగా నిలిచింది . ఈ సినిమాలో అజయ్ దేవగన్, శ్రియా శరణ్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa