ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'అడవి తల్లి 'పాట రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 04, 2021, 10:40 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి నటిస్తున్న సినిమా భీమ్లానాయక్. మలయాళం లో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నారు.


సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రచించారు. సితార ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రానాకు జోడీగా మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ కనిపించనుంది. ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. ఇక భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుంది.


తాజాగా ఈ సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం ఇచ్చింది. ఈ చిత్రం లో నాలుగో పాట అడవి తల్లి మాట ను రిలీజ్ చేశారు. భీమ్లా నాయక్ సోల్ గా ఈ సాంగ్ ను అభివర్ణిస్తున్నారు. సినిమా కధాంశాన్ని ఈ పాటలో చూపించేశారు. ముఖ్యంగా లిరిక్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారింది. అలానే ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa