తన తమ్ముడు అమన్‌తో కలిసి రాఖీ పండుగను రకుల్ ప్రీత్ సింగ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో రకుల్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. తమ్ముడు అమన్ కలిసి దిగిన ఫొటోను రకుల్ పోస్ట్ చేశారు. `రాఖీ టైమ్ విత్ మై లవ్లీ మాన్‌స్టర్!! నాకు తమ్ముడిగా ఉన్నందుకు కృతజ్ఞతలు` అంటూ రకుల్ ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నారు. ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో బెల్లంకొండ శీను సరసన రకుల్ నటించిన `జయ జానకీ నాయక` చిత్రం ఆగస్ట్ 10న విడుదలకాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa