2021 లో కొన్ని సినీ సెలబ్రిటీ జంటలు విడాకులు, బ్రేకప్ వార్తలతో తమ ఫ్యాన్స్ కి షాకిచ్చాయి. సమంత-నాగచైతన్య, అమిర్‌ఖాన్-కిరణ్‌రావు లాంటి స్టార్ సెలబ్రిటీలు ఈ ఏడాది షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ లిస్ట్ ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం.
సమంత-నాగచైతన్య
నాగచైతన్య-సమంతలకు 2017లో వివాహమైంది. వివాహం అనంతరం వీరిద్దరూ కలిసి ‘మజిలీ’ సినిమాలో నటించారు. ఈ ఏడాది అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్‌కు గురి చేశారు.
ఆమిర్‌ఖాన్-కిరణ్‌రావు
ఆమిర్‌ఖాన్ తన భార్య కిరణ్‌రావుతో 15 ఏళ్ల వైవాహిక బంధం ముగిసిందని ప్రకటించారు. 2005లో వీరు పెళ్లి చేసుకొన్నారు. ప్రేమతో విడిపోయి స్నేహితులుగా ఉంటామంటూ ఈ ఏడాది జులైలో ఈ జంట చేసిన ప్రకటనతో ఫ్యాన్స్ అందరూ షాకయ్యారు.
మెహరీన్-భవ్య బిష్ణోయ్
నటి మెహరీన్ హరియాణా మాజీ సీఎం మనువడు భవ్య బిష్ణోయ్‌తో జరిగిన ఎంగేజ్ మెంట్ ను రద్దు చేసుకుంది. భవ్య తనకెంతో నచ్చేశాడని, అతనితో ప్రేమలో ఉన్నానని చెప్పిన మెహరీన్ హఠాత్తుగా బ్రేకప్ చెప్పింది.
సుస్మితాసేన్-రోహ్మన్‌షాల్
సుస్మితాసేన్, ఆమె ప్రియుడు రోహ్మన్ బ్రేకప్ చెప్పుకున్నారు. చాలా సంవత్సరాల నుంచి డేటింగ్‌లో ఉన్న వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఇటీవల ఇన్‌స్టా వేదికగా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa