ఒకానొక సందర్భంలో తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని ప్రముఖ నటుడు జూ.ఎన్టీఆర్ తెలిపారు. 'ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ కార్యక్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. 18 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ రెండో సినిమాకే స్టార్ స్టేటస్ చూశాడు. అయితే తర్వాత కొన్ని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఆ సమయంలో డిప్రెషన్‌కి గురయ్యానని, భవిష్యత్ ఎలా ఉండబోతుందనే విషయంపై మానసిక ఒత్తిడికి గురయ్యానని ఎన్టీఆర్ చెప్పారు. ఆ పరిస్థితి నుంచి తనను రాజమౌళి బయటకు తీసుకొచ్చాడని, ప్రతికూల ఆలోచనలను పోగొట్టి ఉన్నత వ్యక్తిగా, మంచి నటుడిగా తనను తీర్చిదిద్దాడని ఎన్టీఆర్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa