కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సినిమా 'కిన్నెరసాని'. ఈ సినిమాలో అన్ షీతల్ హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. దర్శకుడు రమణ తేజ ఈ కథను ఓ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి కథ దేశరాజ్ సాయితేజ్. దినేష్ కె బాబు ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ అన్వర్ అలీ.SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రంలో ఆన్ శీతల్, మహతి బిక్షు మరియు కాశిష్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రం జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa