మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "భోళా శంకర్ ". ఈ సినిమాను మెహర్ రమేష్ దర్శకత్వంలో A.K . ఎంటర్టైన్మెంట్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఐతే , ఈ సినిమాకు సంబంధించి చిన్న అప్డేట్ ఇవ్వడం జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన చిన్న క్లిప్ ని అనగా చిరంజీవి గెట్ అప్ ని చూపిస్తాము అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ వార్త విన్న మెగా స్టార్ అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సినిమాలో మాస్ ఎలెమెంట్స్ తో పాటు చెల్లెలి సెంటిమెంట్ కి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అని తెలిసిన విషయమే. ఈ సినిమా లో చిరంజీవి చెల్లెలి క్యారెక్టర్ లో మహానటి కీర్తి సురేష్ ఎంపిక అవ్వడం అలానే తన భర్త క్యారెక్టర్ లో ఈ మధ్యనే హీరో నాగ సౌర్య ని ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా కానీ ఈ సినిమాలో ఎంత మంది ప్రముఖులు ఉన్న కానీ , చిరంజీవి సినిమా కాబట్టి అందరూ అదృష్టంగా భావిస్తారు అనేది వాస్తవం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa