యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం రాజావారు 'రాణి గారు', 'ఎస్ఆర్ కళ్యాణమండపం' సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో యంగ్ హీరో ఛాన్స్ కొట్టేశాడు. కిరణ్ అబ్బవరం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మాణంలో బన్నీ వాసు నిర్మాణంలో ఓ చిత్రం ప్రారంభమైంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో జరిగాయి. గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ నెం.7 చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ 'వినరో భాగ్యము విష్ణు కథ' అని చిత్ర బృందం తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa