ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుష్ప 'ఊ అంటావా మావా' ఫుల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 07, 2022, 08:39 PM

అల్లు అర్జున్ - రష్మిక కాంబినేషన్లో రూపొందిన 'పుష్ప' సినిమా క్రితం నెలలో 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. అయితే 'ఓ అంటావా మావా' అనే స్పెషల్ సాంగ్ కి మాస్ ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. చంద్రబోస్ అందించిన సాహిత్యం .. ఇంద్రావతి ఆలాపన .. గణేశ్ఈ ఆచార్య కొరియో గ్రఫీ ఈ పాటకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ రోజు రాత్రి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను మంచి వసూళ్లను రాబట్టింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa