తమిళ హీరో ధనుష్ తాజాగా తెలుగు సినిమా చేస్తున్నాడు. తెలుగులో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో 'సార్', తమిళంలో 'వతి' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈరోజు నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాలేజ్ డ్రెస్ లో ఉన్న ధనుష్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa