బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టిపై నమోదైన 'ముద్దు' కేసులో ఆమెకు ఊరట లభించింది. 2007లో రాజస్థాన్ లో ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్, శిల్పా శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా బుగ్గపై రిచర్డ్ ముద్దు పెట్టడం తీవ్ర దుమారం రేపింది. దీంతో ఆమె అశ్లీలతను ప్రోత్సహించారని కేసు నమోదు కాగా.. రిచర్డ్ చర్యకు శిల్పా శెట్టే అసలు బాధితురాలు అని పేర్కొంటూ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది.