టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్ హీరోల సతీమణులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రత, రామ్ చరణ్ భార్య ఉపాసన, అల్లు అర్జున్ భార్య స్నేహ.. తమ భర్తలకు సంబంధించిన సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తమ అభిమానులతో పంచుకుంటూ నెట్టింట సందడి చేస్తుంటారు. తాజాగా వీరి జాబితాలోకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మిప్రణతి చేరారు. పెళ్లయిన కొత్తలో ఎన్టీఆర్‌తో కలిసి ఒకటి రెండు ఆడియో ఫంక్షన్లలో సందడి చేసిన ప్రణతి.. ఇద్దరు పిల్లల తల్లి అయిన తర్వాత మీడియాకు దూరంగా ఉన్నారు. కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా ప్రణతి బయటి ఫంక్షన్లకు వెళ్లలేదు. దీంతో ఆమె ప్రస్తుతం ఎలా ఉందో కూడా ఎన్టీఆర్ అభిమానులకు తెలియదు. తాజాగా ఆమె ట్విటర్ అకౌంట్‌ని ఓపెన్ చేశారు. తొలి పోస్ట్‌గా 'మీ అందరితో కలిసి ట్విటర్‌లో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నా మొదటి ట్వీట్ నా లవ్లీ భర్తతో పోస్ట్ చేస్తున్నాను'అంటూ ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫోటోని ట్వీట్ చేసింది ప్రణతి. రెండో ట్వీట్‌గా త్రోబ్యాక్ పిక్చర్ అంటూ ఎన్టీఆర్, రాజమౌళిలతో కలిసి ఉన్న పాత ఫోటోని షేర్ చేసింది. లక్షిప్రణతి ట్విటర్‌లోకి అడుగుపెట్టిన గంటల్లోనే కొన్ని వేలమంది ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు.
Happy to join Twitter with You all! Posting my First tweet with my lovable husband @tarak9999 #NTR. pic.twitter.com/2vQNuuLVDJ
— Lakshmi Pranathi (@LakshmiNTR_) January 27, 2022
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa