యంగ్ హీరో నిఖిల్ ఈ ఏడాది కిరాక్ పార్టీ అనే రీమేక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు నిఖిల్.. ప్రస్తుతం తమిళ్‌లో విజయం సాధించిన కనితన్ మూవీని తెలుగులో రీమేక్ లో నటిస్తున్నాడు..కాగా ఈరోజు నిఖిల్ పుట్టిన రోజు కావడంతో ఆ మూవీ ఫస్ట్ లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ముద్ర అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. టీఎన్ సంతోష్ దర్శకుడు.. ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్, ఎల్ఎల్‌పి పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa