తమిళ స్టార్ హీరో తాలా అజిత్ హీరోగా, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ విలన్గా నటించిన చిత్రం వలిమై. హెచ్. వినోద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించారు. హ్యూమా ఖురేషి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఫిబ్రవరి 24న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైంది. తెలుగులో అంతంత మాత్రంగానే ఉన్న ఈ సినిమా తమిళనాట భారీ కలెక్షన్లు రాబట్టింది.
తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 భారీ ధరకు కొనుగోలు చేసిందని వినికిడి. ఈ నెల 25న వలిమై ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వస్తుందని చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa