యంగ్ హీరో విరాజ్ అశ్విన్ ప్రస్తుతం 'జోరుగా హుషారుగా' అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ని అలరించడానికి సిద్ధం అవుతున్నాడు.పూజిత పొన్నాడ,సోనూ ఠాకూర్,మధునందన్,సిరి హన్మంత్,క్రేజీ ఖన్నా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.అను ప్రసాద్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.పోస్టర్‌లో విరాజ్ అశ్విన్ తన స్నేహితులను భారీ పెన్నుపై మోస్తున్నట్లు కనిపిస్తోంది.శిఖర,అక్షర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో సాయికుమార్,రోహిణి, బ్రహ్మాజీ,చమ్మక్ చంద్ర,సతీష్ సారెపల్లి,జెమినీ సురేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa