బాలీవుడ్ లో సెలబ్రిటీల మధ్య పుట్టే ప్రేమ పెళ్లిళ్ళకి పులిస్టాప్ పడడం లేదు. ఒకరి తర్వాత మరొకరం అన్నట్టు తమకి నచ్చిన వారిని వివాహం చేసుకుంటూ వెళుతున్నారు బాలీవుడ్ స్టార్స్. ఇటీవల సోనమ్ కపూర్ తన ప్రియుడు ఆనంద్ ఆహుజాని వివాహం చేసుకొని హ్యపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ తన ప్రియురాలు ఆలియాని త్వరలోనే వివాహం చేసుకోనున్నాడు. ఇందుకు సంబంధించి రీసెంట్ గా క్లారిటీ కూడా ఇచ్చాడు.
సంజూ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో భాగంగా రణ్ బీర్ తన ప్రేమాయణంపై వస్తున్న వార్తలని ధృవీకరించాడు. జీక్యూకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలియాతో డేటింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. అవునని రణ్ బీర్ చెప్పాడు. ఇప్పుడే ప్రేమ మొదలైంది. దీనిపై ఎక్కువగా మాట్లాడను. కాస్త సమయం కావాలి. ఆలియా ఓ అద్భుతమైన నటి, అంతకుమించి మంచి మనిషి అని రణ్ బీర్ అన్నాడు. కొత్తగా ప్రేమలో పడినప్పుడల్లా తాను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఎక్సైటింగ్ గా ఉంది. కొత్త వ్యక్తి.. అన్నీ కొత్తగా ఉన్నాయి. అయితే రెండేళ్ల కిందటితో పోలిస్తే నేనిప్పుడు చాలా మారిపోయాను. బంధాలకు విలువిస్తున్నాను అని ఈ స్టార్ హీరో అన్నాడు.
ఆలియా గురించి చెప్పాలంటే కొత్త పదం కనిపెట్టాలి అంటూ మనసులో మాటలు చెప్పాడు రణ్ బీర్. అయితే ఆలియాని వివాహం చేసుకోవడం రణ్ బీర్ ఫ్యామిలీకి కూడా ఇష్టమనే తెలుస్తుంది. ఇందుకు కారణం ఆ మధ్య రణ్ బీర్ తండ్రి రిషి కపూర్ తన ట్విట్టర్ లో భట్ ఫ్యామిలీతో మంచి స్నేహం ఉంది. చాలా సినిమాలు కలిసి చేశాం. ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు. ఇక రీసెంట్ గా రణ్ బీర్ అక్క రిద్ధిమా కపూర్.. ఆలియాకి బ్రాస్ లెట్ గిఫ్ట్ గా పంపింది.ఆ బ్రాస్ లెట్ ఫోటోని ఆలియా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ నచ్చేసిందనే కామెంట్ పెట్టింది. ఏదేమైన త్వరలో ఒకటి కానున్న కపూర్ , భట్ ఫ్యామిలీలు ఇప్పటి నుండే ఒకరిపై ఒకరికున్న ప్రేమని నిరూపించుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa