ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెటిజన్లకు సమంత స్ట్రాంగ్ కౌంటర్

cinema |  Suryaa Desk  | Published : Sun, Mar 13, 2022, 11:16 AM

నిత్యం అభిమానులతో సోషల్ మీడియా వేదికగా టచ్‌లో ఉంటుంది సమంత. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ, బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా ఉంటూ నిత్యం బిజీగా ఉంటుంది. విడాకుల తర్వాత సినిమాలపై ఫోకస్ పెంచింది. అంతేకాకుండా హాలీవుడ్ చిత్రానికి ఓకే చెప్పేసింది. డైరెక్ట‌ర్ పిలిప్ జాన్ ద‌ర్శ‌క‌త్వంలో రానున్న అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌ సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌‌లోనూ పాగా వేసేందుకు పక్కా కసరత్తు చేస్తోంది. ఇటీవల ఓ సినిమా వేడుకకు సమంత హాజరైంది. అందులో డిజైనర్ దుస్తులు ధరించి తళుక్కుమంది. వేడుకలో అందరి చూపులూ సమంత వైపే నిలిచాయి. కొంచెం మోడ్రన్‌గా, అందాల ఆరబోతతో అందరినీ ఆకర్షించింది. ఈ హాట్ లుక్స్‌కు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా పలువురు హీరోయిన్లు, సినీ ప్రముఖులు స్పందించారు. సమంతను పొగుడుతూ కామెంట్లు చేశారు. ఈ క్రమంలో కొందరు నెటిజన్లు ట్రోలింగ్ ప్రారంభించారు. మితిమీరిన అందాల ప్రదర్శన ఎందుకు అంటూ విమర్శలు ప్రారంభించారు. దీంతో ఆ ట్రోలింగ్‌పై సామ్ ఘాటుగా స్పందించింది. మహిళలు ధరించే దుస్తులు, మతం, చదువు, సామాజిక స్థితి, రూపురేఖలు, చర్మం రంగు ఆధారంగా అందరూ కామెంట్లు చేస్తారని చెప్పింది. కొంత మందికి ఎదుటి వారిని జడ్జ్ చేయడం ఇష్టమని పేర్కొంది. అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి, మన పనిపై మనం దృష్టి పెట్టాలంటూ ట్రోలర్లకు ఘాటు రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద సినిమాలలో నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa