మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ సోదరుడిగానే కాకుండా మెగా బ్రదర్ నాగబాబుకు తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్నారు. తరచూ సోషల్ మీడియా ద్వారా అందరికీ అందుబాటులో ఉంటారు. మెగా ఫ్యామిలీపై ఈగ వాలినా ఆయన సహించరు. ఎవరైనా తమ ఫ్యామిలీని ఒక్క మాట అన్నా, వెంటనే కౌంటర్ ఇస్తుంటారు. జనసేన పార్టీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఆ వ్యాఖ్యల అంతరార్థం ఏమిటో అర్థం కాక ఆయన సన్నిహితులు, ప్రత్యర్థి పార్టీల వ్యక్తులు అమోమయానికి గురవుతున్నారు. ఆ పోస్ట్‌లో ‘ఇన్నాళ్ల నా జీవితంలో.. ఎన్నో ఒడిదుడుకులను చూశాను. ఎన్నో విపత్తులను ఎదుర్కొని నన్ను నేనుగా మార్చుకోగలిగాను. ఒక రకంగా చూస్తే ఈ కష్టాలు, కన్నీళ్లే నన్ను ఒక పూర్తి మనిషిగా మలచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా ప్రజలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నాను.
అదే గమ్యంగా నా లక్ష్యం వైపు పయనం సాగించాను. ఈ పయనంలో నాకు ఎన్నో ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురైనా, కానీ.. నన్ను ప్రతిసారి వెన్నంటి నడిపించి నాకు మనిషిగా ఎదిగే అవకాశాన్ని ఇచ్చింది కూడా ఈ కష్టాలు, కన్నీళ్లే. అందుకే ఇప్పటి నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం చేరుకోవడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను. మరిన్ని వివరాలతో త్వరలో మీ ముందుకొస్తాను.. ఎన్ని కష్టాలొచ్చినా ఈ బాటసారి ప్రయాణం కొనసాగుతుంది’ అని రాసుకొచ్చారు నాగబాబు. దీంతో ఆయన చిత్ర నిర్మాణం వైపు దృష్టి సారించారని కొందరు, జనసేనకు రాజీనామా చేస్తున్నారని మరికొందరు భావిస్తున్నారు. ఇక పార్టీ అభిమానులైతే జనసేనలో ఇక నుంచి క్రియాశీలకంగా వ్యవహరిస్తారను ఆశాభావంతో ఉన్నారు. సోమవారం(మార్చి 14న) ఏపీలోని తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. సభ ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa