పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీతో ప్రేమాయణం కొనసాగించానని, అతనితో ఏకాంతంగా గడిపా(శృంగారంలో పాల్గొన్నా) అంటూ బాలీవుడ్ నటి ఆర్షిఖాన్ గతంలో చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. ఆ దెబ్బకి అర్షి పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఒక రకంగా బిగ్‌బాస్ హౌజ్‌కు సెలబ్రిటీగా ఆమెకు ఛాన్స్ దక్కటానికి కూడా కారణం ఆ వ్యవహారమే. అయితే 2015లో ట్వీట్ చేసిన తర్వాత అఫ్రిదీ గురించి, ఆ ట్వీట్ గురించి ఆమె ఎక్కడా నోరు మెదపలేదు. తాజాగా ఓ ఛానెల్ చిట్‌ఛాట్ ప్రొగ్రాంలో నటి రాఖీ సావంత్‌తో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా ట్వీట్ ప్రస్తావన రాగా, ఆమె స్పందిస్తూ. ‘అఫ్రిదీ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన నా కోసం ఎంతో చేశారు. ఆ ట్వీట్ చేయటం నా పొరపాటే. ఆయన్ని అనవసరంగా ఇందులోకి లాగాను. ఆయన్ని క్షమాపణలు కోరుకుంటున్నానని తెలిపింది. ఈ ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa