లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన్ తార రహస్యంగా పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇటీవల హల్ చల్ చేస్తోంది. దాన్ని నిజం చేసేలా కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, నయనతార కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తామిద్దరితో తనకు నిశ్చితార్థం జరిగినట్లు నయనతార ఓ కార్యక్రమంలో వెల్లడించింది. ఆమె త్వరలో పెళ్లి చేసుకోనుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారని సోషల్ మీడియా కోడై కూసింది. ఇటీవల నయనతార ఓ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లింది. బయటకు వస్తూ పెళ్లయిన స్త్రీల మాదిరిగా బొట్టు పెళ్లయినట్లే కనిపించడం ఈ వార్తలకు బలం చేకూర్చేలా అనిపించింది.గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే వీటిని విఘ్నేష్-నయనతార అధికారికంగా ప్రకటించలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa