ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడు తండ్రి.... ఇప్పుడు తనయుడికి దక్కిన అరుదైన గౌరవం...

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 12:26 PM

దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కనుంది. చేసింది తక్కువ సీనియాలే అయినా కన్నడ నాట మంచి క్రేజ్ తెచ్చుకున్నారు పునీత్. పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన పునీత్ అంటే హీరో గానే కాక మంచి మనసున్న మనిషిగా కూడా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.  


తాజాగా మైసూరు విశ్వవిద్యాలయం పునీత్ కు డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ విషయమై ఇప్పటికే పునీత్ కుటుంబ సభ్యులతో చర్చించిన  మైసూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హేమంత్ కుమార్ త్వరలో జరగబోయే స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్ ను ఆయన భార్య అశ్వినికి అందజేస్తారట. అయితే పునీత్ తండ్రి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు కూడా1976లో మైసూరు యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. తండ్రి కొడుకులిద్దరికీ ఈ అరుదైన గౌరవం దక్కటం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa