ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయమ్మగా యాంకర్ సుమ పంచాయితీ ఆ రోజే!

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 12:24 PM

బుల్లితెర సీనియర్ యాంకర్ సుమ కనకాల లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు డైరెక్షన్ వహిస్తున్న ఈ సినిమాని వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 


టెలివిజన్ ప్రెజెంటర్ గా బుల్లితెర మీద బిజీగా గడిపే సుమ కనకాల అడపా దడపా క్యామియో రోల్స్ లో సినిమాల్లో కనిపిస్తారు. అయితే ఆమె నటిస్తున్న ఫుల్ లెంగ్త్ సినిమా జయమ్మ పంచాయితీ. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం. 'పంచాయితీ తుది తీర్పు వచ్చేసిందహో, ఏప్రిల్ 22వ తేదీన ఈ సినిమా విడుదల' అంటూ సుమ గారు ట్వీట్ చేసారు. విడుదల తేదీని ప్రకటిస్తూ చేసిన ఫన్నీ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మార్చి 25, ఏప్రిల్ 14, ఏప్రిల్ 29, మే 12, అంటూ సుమ ఈ వీడియోలో చేసిన అల్లరి చాలా బాగుంది. ఆ తేదీలలో వరసగా RRR, KGF:CHAPTER2, ఆచార్య,సర్కారు వారి పాట వంటి పెద్ద సినిమాలు ఉండటంతో ఎలాగైనా ఏప్రిల్ 22 న  తన పంచాయితీ తీర్పును వెలువరిస్తానని సుమ ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa