ఇండియన్ సూపర్ హీరో చిత్రం అంటే గుర్తొచ్చే సినిమా క్రిష్. ఎప్పుడో 2006లో 'కోయి మిల్ గయా' సినిమాతో ఈ సూపర్ హీరో సిరీస్ కి అంకురం వేశారు బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత రాకేష్ రోషన్. తన కుమారుడు హృతిక్ రోషన్ హీరోగా క్రిష్ సిరీస్ లో మూడు భాగాలను తెరకెక్కించారు. ఈ సినిమాలన్నీ కూడా బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండ్ హైయెస్ట్ గ్రాసర్ సినిమాలు. క్రిష్ సిరీస్ కు కేవలం హిందీ ప్రేక్షకులు మాత్రమే కాక దేశ వ్యాప్తంగాకూడా అభిమానులు ఉన్నారు. క్రిష్ 3 వచ్చి ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి ఎటువంటి అప్డేట్ లేదు. అప్పుడెప్పుడో మొదలు పెట్టబోతున్నట్టు వినబడినా ఈ లోపు కరోనా కారణంగా వాయిదా పడింది.
తాజాగా బాలీవుడ్లో ఈ సిరీస్ పై కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. వాటి ప్రకారం జూన్ నెల మొదటి పదిహేను రోజులలో క్రిష్ 4 కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులను అధికారికంగా ప్రకటిస్తారట రాకేష్ రోషన్. ఈ సినిమాలో నటించనున్న నటీనటుల ఎంపిక ప్రస్తుతం జరుగుతుందట. టైం ట్రావెల్ నేపథ్యంలో క్రిష్ 4 ఉంటుందని సమాచారం. ప్రస్తుతం హృతిక్ ఫైటర్, విక్రమ్ వేద రీమేక్ చిత్రాల్లో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa