ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ లో అనన్య పాండే

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 02:02 PM

లైగర్ మూవీ తో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే..తాజా షూట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ షూట్ చూసిన నెటిజన్లు అసలు ఈ భామ డ్రెస్ వేసుకుందా లేదా అని అనుమానిస్తున్నారు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రం ద్వారా వెండితెర కు హీరోయిన్ గా పరిచమైన అనన్య పాండే..మొదటి మూవీ తోనే సూపర్ హిట్ అందుకోవడమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని వార్తల్లో నిలిచింది. ఈ మూవీ తర్వాత అమ్మడికి వరుస ఛాన్సులు తలుపు తట్టాయి. ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘అంగ్రేజీ మీడియం’, ‘ఖాలీ పీలీ’ వంటి చిత్రాల్లో నటించింది. వీటన్నింట్లో తన అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను మన్ననలు పొందింది.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘లైగర్’ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ మూవీని కరణ్ జోహార్ సమర్పణలో పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లో రెచ్చిపోతూ వైరల్ గా మారింది అనన్య.తాజాగా ఓ ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ వేసుకుని దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో ఆమె బట్టలు ఉన్నా లేనట్లే కనిపిస్తూ ఆమె అందాలను బయటపెడుతున్నాయి. దీంతో ఈ పిక్స్ చూసేందుకు అభిమానులు , ఫాలోయర్స్ , నెటిజన్లు పోటీ పడుతున్నారు.





 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa