ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహ వ్యవస్థకి గౌరవం ఇవ్వాలని చెప్తూనే... ఆ పని చేస్తే ఎలా అమీర్?

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 03:25 PM

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన రెండవ భార్య కిరణ్ రావు నుండి గతేడాది విడాకులు పొందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమిర్ పై పలు విమర్శలు వచ్చాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఆమిర్ మాట్లాడుతూ "సాధారణ ప్రజానీకం మా విడాకుల గురించి అర్థం చేసుకోవటం చాలా కష్టమే. కిరణ్, నేను ఇద్దరం కూడా ఎంతో చర్చించి విడాకుల నిర్ణయం తీసుకున్నాం. విడిపోయిన తర్వాత ఎడమొహం పెడమొహం అన్నట్టు కాకుండా వివాహ వ్యవస్థకు గౌరవాన్ని ఇవ్వాలని అందుకే మేమిద్దరం ఇప్పటికీ స్నేహితుల్లా నవ్వుతూ మాట్లాడుకుంటాం. పిల్లల బాధ్యతని ఇద్దరం కలిసి నిర్వర్తిస్తాం. నా ఇద్దరు మాజీ భార్యలతో ఇప్పటికీ నాకు సత్సంబంధాలున్నాయి"అని చెప్పుకొచ్చారు. ఆమిర్ తన ఇద్దరు మాజీ భార్యలు సంయుక్తంగా స్థాపించిన పానీ ఫౌండేషన్ పనులను అందరం కలిసే నిర్వర్తిస్తామని తెలిపారు ఆమిర్. 


ఆమిర్ మొదటి భార్య రీనా దత్తా. 1986 లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2002 లో విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఐరా ఖాన్, జునైద్ ఖాన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa