పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ప్రమోషన్ లో ప్రభాస్ మాట్లాడుతూ బాహుబలి పార్ట్ 3 గురించి తనకు తెలియదని, రాజమౌళి అనుకుంటే మాత్రం తప్పకుండా సాధ్యమవుతుందని చెప్పి అభిమానులను సందిగ్ధంలో పడేసారు.
అయితే తాజాగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 పై పూర్తి క్లారిటీ ఇచ్చారు. 'బాహుబలి పార్ట్ 3 తప్పకుండా ఉంటుంది. దీనికి సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ చేసాము. కాకపోతే ఇప్పటికే కమిటైన కొన్ని సినిమాల వల్ల ఈ సినిమాని తెరకెక్కించటం కాస్త ఆలస్యమవుతుంది." అని చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి సినిమాలో బాహుబలి చుట్టూ జరిగే సంఘటనలను ప్రేక్షకులకు చూపిస్తామని రాజమౌళి చెప్పారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాహుబలి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగణ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa