కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్. ‘హమ్ ఫిట్ హైతో ఇండియా ఫిట్’ పేరుతో మొదలైన ఛాలెంజ్‌కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవల మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ఈ ఛాలెంజ్‌ని స్వీకరించి ఎన్టీఆర్‌ని కూడా ఇందులో పాల్గొనమని కోరాడు. ఇందుకు హాలీవుడ్ ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో భారీ వర్కవుట్స్ చేసిన వీడియోని షేర్ చేసాడు తారక్. అంతేకాదు ఈ ఛాలెంజ్‌ని మహేశ్ బాబు, నందమూరి కల్యాణ్ రామ్, రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివని స్వీకరించమని తెలిపాడు. కళ్యాణ్ రామ్ ఆ ఛాలెంజ్ ని పూర్తి చేసాడు. అతను ట్రైనర్ సమక్షంలో జిమ్ లో చెమటోడ్చిన వీడియోని అప్ లోడ్ చేసారు. తరువాత కళ్యాణ్ రామ్ .. అల్లు అర్జున్ , సాయి ధరమ్ తేజ్ , రామ్ లకు ఛాలెంజ్ విసిరారు. కళ్యాణ్ రామ్ నా నువ్వే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తమన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనబడనున్నాడు.
Challenge accepted nanna @tarak9999 .. Here's a glimpse of my daily fitness routine with @afzalfitnesspal. Stay fit. Stay healthy. I now nominate @alluarjun @ramsayz @IamSaiDharamTej for the #HumFitTohIndiaFit challenge pic.twitter.com/4odbum3gux
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 2, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa