బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన మాజీ మిస్ వరల్డ్ ప్రియాంకా చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడికెళ్లినా ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని వెళ్తున్నారు. ఈ మధ్యే ఓ బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఇప్పుడు లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్ హాలీవుడ్‌లో ఉన్న టోకా మెడెరాలో డిన్నర్ డేట్‌కు వెళ్లారు. బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వచ్చినప్పుడే ఈ ఇద్దరి మధ్యే ఏదో నడుస్తున్నదన్న పుకార్లు వచ్చాయి. ఇప్పుడు డిన్నర్‌కు వెళ్లడంతో ఆ రూమర్లు నిజమయ్యాయి. బేస్‌బాల్ గేమ్ చూసిన తర్వాత ఇద్దరూ ఓ బోటులో ఫ్రెండ్స్‌తో కలిసి హాలీడే ఎంజాయ్ చేశారు. నిజానికి గతేడాది తొలిసారి మెట్ గాలాలో ఈ ఇద్దరూ కలిసి రెడ్ కార్పెట్‌పై మెరిశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa