ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్వేతా పెళ్ళవుతోందోచ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 04, 2018, 09:31 AM

కొత్త బంగారు లోకంలో ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిగా అమాయకపు నటనతో ఆకట్టుకున్న శ్వేతా బసు ప్రసాద్ ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ అవేవి ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇటీవలే తెలుగు వెబ్ సిరీస్ గ్యాంగ్ స్టార్స్ కోసం రీ ఎంట్రీ ఇచ్సిన ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లి కూతురు కానుంది. ఫిలిం మేకర్ రోహిత్ మిట్టల్ తో తన నిశ్చితార్థం కూడా అయిపోయిందట. గత నాలుగేళ్లుగా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నప్పటికి మీడియా హడావిడికి భయపడి బయట పెట్టని శ్వేతా ఇప్పుడు పెళ్లి కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. అన్నట్టు ఇద్దరి మధ్య ఈ బాండింగ్  కుదిర్చింది ఎవరో తెలుసా. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్. ఇద్దరితోనూ సాన్నిహిత్యం ఉన్న అనురాగ్ వాళ్ళ తల్లితండ్రులతో మాట్లాడి మొత్తం సెట్ చేసినట్టు తెలిసింది. కాకపోతే పెళ్లి కి మాత్రం తొందరపడటం లేదని టాక్. శ్వేతా ముందు గోవాలో ప్రపోజ్ చేస్తే ఆ తర్వాత కొంత కాలానికి రోహిత్ తన స్వంత ఊరు పూణేలో లవ్ ప్రపోజల్ ఇచ్చాడట . 


మొత్తానికి మరో హీరోయిన్ లవ్ ట్రాక్ పెళ్లితో సుఖాంతం కాబోతోంది.కానీ నేరుగా అడిగితే మాత్రం శ్వేత దాటవేస్తోంది. ఈ ప్రేమ పెళ్లి అనేవి తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవని వాటిని బయట పెట్టుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇస్తోంది. తమ పర్సనల్ లైఫ్ గురించి నలుగురికి చెప్పాలని తొందర లేదని స్పష్టం చేస్తోంది. గ్యాంగ్ స్టార్స్ తనకు పేరు తీసుకొచ్చి అవకాశాలు తెస్తుందనే నమ్మకంతో ఉంది శ్వేత. ప్రత్యేకంగా దీని ప్రమోషన్ కోసమే హైదరాబాద్ లో కొన్ని రోజులు మకాం వేసిన శ్వేతా బసు ప్రసాద్ రెగ్యులర్ హీరోయిన్ గా కాదు కానీ స్పెషల్ రోల్స్ లేదా క్యామియోస్ లో వర్క్ అవుట్ చేసుకునే  ఛాన్స్ అయితే ఉంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa