ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ సినిమా నుండి కొత్త అప్డేట్.... రెండో పాటకి ముహూర్తం...

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 12:40 PM

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బ్యాంకు స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, గ్లిమ్ప్స్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా నుండి విడుదలైన మొదటి పాత కళావతి గురించైతే చెప్పనవసరం లేదు. యూట్యూబులో ఈ పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. యువత కళావతి స్టెప్పులేస్తూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. 


తాజాగా ఈ సినిమా నుండి మరొక పాటను విడుదల చేయటానికి ముహూర్తం ఖరారు చేసారు నిర్మాతలు. సర్కారు వారి పాట నుండి రెండో పాటను మార్చి 20న విడుదల చేయనున్నట్లు తెలిపే ఒక స్పెషల్ పోస్టర్ను సోషల్ మీడియాలో వదిలారు. థమన్ స్వర పరిచిన ఈ రెండో పాట ఎలా ఉండనుండో తెలియాలంటే మార్చి 20వరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa