ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవర్ స్టార్ చివరి చిత్రానికి కన్నడిగుల జేజేలు....

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 12:38 PM

కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన ఆఖరి చిత్రం "జేమ్స్" నేడు దేశ వ్యాప్తంగా విడుదలైంది. మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. తమ అభిమాన నటుడిని ఆఖరి సారిగా వెండి తెరపై  చూడటానికి కన్నడిగులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. దీంతో కర్ణాటకలోని ధియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. 


పునీత్ నటించిన జేమ్స్ చిత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్ కావటంతో అప్పు చేసిన యాక్షన్ సీన్స్ ను చూసి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. ధియేటర్ల నుండే ఈ మూవీ రివ్యూను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మొదటి భాగం వరకు అప్పు నటన ఒక రేంజులో ఉందని పోస్ట్లు పెడుతున్నారు. ధియేటర్ల బయట,లోపల అనే తేడా లేకుండా అప్పు..అప్పు అనే నినాదాలు చేస్తూ పునీత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 


ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ నటించగా, చేతన్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa