ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలోనే బుల్లితెరపై "పెళ్లి సందD"

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 17, 2022, 12:36 PM

గౌరి రోరంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాకి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు దర్శకత్వ పర్యవేక్షణ చేయగా, మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా 1996లో హీరో శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.


గతేడాది రిలీజైన పెళ్లి సందడి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. కానీ ఈ సినిమాకి బాడ్ రివ్యూలు, విమర్శలు తప్పలేదు. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు నిర్మాతలు  ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ ను దాదాపు 7 కోట్లకు అమ్మినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ప్రసార హక్కులను జీ 5 ఛానెల్ కొనుగోలు చేసింది. త్వరలోనే ఈ సినిమా బుల్లితెరపై సందడి చేయటానికి రెడీగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa