ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్ పార్ట్-2 త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ‘తుఫాన్’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను మార్చి 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. హోంబలే సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రలో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa