ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన ఎంట్రీకి సంబంధించిన వార్తలు కొంతకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కరోనా ప్రభావం వలన ఆయన సినిమాకి సంబధించి ఫస్టులుక్ పోస్టర్ బయటికి రావడానికి కొంత ఆలస్యమైంది. ఈ సినిమాకి 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' అనే టైటిల్ ను ఖరారు చేయడం జరిగింది. చింతపల్లి రామారావు - ఎమ్మెస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి, టైటిల్ తో కూడిన నితిన్ చంద్ర ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో నడుస్తూ .. సిగరెట్ వెలిగించే ఈ పోస్టర్ లో ఆయన మాస్ లుక్ తో రఫ్ గా కనిపిస్తున్నాడు. కైలాస్ మీనన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంతవరకూ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన సతీశ్ వేగేశ్న, ఈ సారి ఇలాంటి ఒక మాస్ సబ్జెక్ట్ ను ఎంచుకోవడం విశేషం. పైగా ఈ సినిమా టైటిల్ సిగరెట్లతో రాసుండటం కొసమెరుపు. ఈ సినిమాలో నాయిక ఎవరు? జోనర్ ఏమిటి? ప్రతినాయకుడు ఎవరు? అనే విషయాలపై త్వరలో క్లారిటీ రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa