బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ తనయురాలు, నట వారసురాలు సోనమ్ కపూర్. 2007లో సావరియా సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఢిల్లీ 6, ఐ హేట్ లవ్ స్టోరీస్, భాగ్ మిల్కా భాగ్, నీర్జా వంటి సినిమాలతో ప్రేక్షకులని అలరించింది. వ్యాపారవేత్త ఆనంద్ అహుజా ని 2018లో వివాహం చేసుకుంది సోనమ్. పెళ్ళైన తర్వాత కూడా సినిమాలలో నటించిన సోనమ్ తాజాగా తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పింది. తను నాలుగు నెలల గర్భవతినంటూ భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆగస్టులో తన జీవితంలోకి కొత్తవారిని ఆహ్వానించబోతున్నట్లు ప్రకటించింది. ఆమె పోస్టుకు తండ్రి అనిల్ కపూర్,తల్లి సునీత కపూర్ కూడా స్పందించారు. అమ్మమ్మ, తాతయ్యలుగా పిలిపించుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉందని, అప్పటి వరకు ఆగలేకపోతున్నామని అనిల్, సునీత కపూర్లు వరస కామెంట్లు పెట్టారు. ఈ వార్తతో సోనమ్ అభిమానులు సంబర పడిపోతున్నారు.