నేషనల్ అవార్డు విన్నర్ సతీష్ వేగేశ్న కొత్త వెబ్ ఒరిజినల్‌ని ప్రారంభించారు.ఈ సిరీస్ కి 'కథలు (మీవీ –మావి)' అనే టైటిల్ ని ఖరారు చేసారు.ఈ దర్శకుడు ఇప్పటికే ఈ సిరీస్ లోని మూడు కథల షూటింగ్ ని ముగించాడు.మిగిలిన కథల షూట్‌ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి,త్వరలో ప్రసారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం,సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సిరీస్‌లోని మొదటి కథ పడవ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.ఈ కథలో ఈషా రెబ్బా అండ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న కుమారుడు సామ్ వేగేశ్న జంటగా నటిస్తున్నారు.ప్రస్తుతం సతీష్ వేగేశ్న కోతి కొమ్మచ్చి,శ్రీశ్రీశ్రీ రాజావారు అనే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa