పుష్ప-2 చిత్రం ఎపుడు అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. ఆ చిత్రం విడుదల ముందుఅనుకొన్న ప్రకారం కాకుండా వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. బన్నీ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ సినిమా 100 కోట్లకి పైగా వసూళ్లను తెచ్చింది. కథాకథనాలు .. సుకుమార్ టేకింగ్ .. పాత్రలను మలిచిన తీరు .. పాటలు ఇవన్నీ కూడా ఈ సినిమా విషయంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి 'పుష్ప 2' పైనే ఉంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా మొదటి షెడ్యూల్ మొదలవుతుందని చెప్పారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే పట్టుదలతో బన్నీ ఉన్నాడని అన్నారు. కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగు వాయిదా పడిందనే టాక్ వినిపిస్తోంది. మే నెలలో గానీ .. జూన్ లో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. మరి అదే నిజమైతే ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేయడం కష్టమే అవుతుందేమో. ఇక ఈ సినిమాలో ముందు పార్ట్ కు మించి ఫైట్లు ఉండాలని బన్నీ చెప్పినట్టుగా తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa