కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నుండి మోస్ట్ అవైటెడ్ మూవీ "వలిమై" కూడా 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి అతని కెరీర్‌లో అత్యధిక వసూళ్లలో ఒకటిగా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత అజిత్ చేయబోయే మరో భారీ సినిమా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీనికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు మరియు ఇప్పుడు ఈ చిత్రం అజిత్ రికార్డ్ బద్దలు కొట్టే రెమ్యూనరేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా కోసం అజిత్ 102 కోట్లు తీసుకుంటున్నాడు. ఆ మొత్తాన్ని అజిత్ కు ఇచ్చేందుకు లైకా ప్రొడక్షన్స్ సిద్ధంగా ఉందన్న టాక్ కూడా నిజమేనని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి అజిత్ తన రెమ్యునరేషన్ తో ఇప్పుడు సంచలనం సృష్టించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa