రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌సీ పార్కులో నటీనటులు అరవింద్ కృష్ణ, సందేశ్, జయశ్రీ రాచకొండ, దర్శకుడు నాగు గవర నాతిచరామి చిత్ర బృందం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సినీ నటుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం కోవిడ్ మాట్లాడుతూ ప్రకృతి పట్ల అందరిలో ప్రేమ మరింత పెరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తరువాత, అరవింద్ కృష్ణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని రవితేజ, రణవిజయ్ సింగ్ మరియు నటి మీనాక్షి దీక్షిత్‌లకు విసిరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa